2023 పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్: ఏ దేశానికి ఏ ర్యాంక్ అంటే
- February 01, 2023
బహ్రెయిన్: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రేటింగ్ 2023 విడుదలైంది. మొదటి త్రైమాసికానికి సంబంధించి గ్లోబల్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో బహ్రెయిన్ ఐదు స్థానాలు ఎగబాకింది. ప్రపంచంలోని బలమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఇప్పుడు బహ్రెయిన్ 61వ స్థానంలో ఉంది.గత సంవత్సరం 66వ స్థానంలో ఉండే. 2021లోబహ్రెయిన్ 69వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం, బహ్రెయిన్‌లు ప్రపంచవ్యాప్తంగా 87 గమ్యస్థానాలకు వీసా-రహిత యాక్సెస్ లేదా వీసా ఆన్-రైవల్ కలిగి ఉన్నది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది 18 సంవత్సరాల చరిత్రాత్మక డేటాతో అత్యంత అధికారిక పాస్‌పోర్ట్ సూచికగా గుర్తింపు పొందింది. ఇండెక్స్ ర్యాంకులు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (IATA) అందించిన డేటాపై ఆధారపడి ఉంటాయి. ఇండెక్స్‌లో 199 విభిన్న పాస్‌పోర్ట్‌లను పొందుపరిచారు.
సౌదీ అరేబియా, ఒమన్, పాపువా న్యూ గినియాతో ఇండెక్స్‌లో 63వ ర్యాంక్‌ను పంచుకున్నాయి.ఈ దేశాలు ప్రపంచవ్యాప్తంగా 82 గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రేటింగ్ ప్రకారం, UAE గతేడాది 15వ స్థానంలో నిలిచిన తర్వాత ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం పడిపోయింది. యూఏఈ ప్రపంచవ్యాప్తంగా 178 గమ్యస్థానాలకు వీసాడైలీ రహిత యాక్సెస్ ఉంది. జపాన్, సింగపూర్‌లు ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. జపనీస్, సింగపూర్‌ల పాస్పోర్ట్ ఉన్న వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 227 గమ్యస్థానాలలో 193 గమ్యస్థానాలను ముందస్తు వీసా లేకుండా సందర్శించడానికి అవకాశం ఉంది.
హెన్లీ & పార్ట్‌నర్స్, గ్లోబల్ ర్యాంకింగ్ ఇండెక్స్ ప్రకారం.. జపాన్, సింగపూర్ మొదటి స్థానంలో (193 గమ్యస్థానాలు), దక్షిణ కొరియా రెండవ స్థానంలో (192 గమ్యస్థానాలు), జర్మనీ, స్పెయిన్ మూడవ స్థానంలో ఉన్నాయి (191 గమ్యస్థానాలు). ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్ 4వ స్థానంలో (190 గమ్యస్థానాలు), ఆస్ట్రియా, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్ 5వ స్థానంలో (189 గమ్యస్థానాలు), ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, UK 6వ స్థానంలో ఉన్నాయి (188 గమ్యస్థానాలు). బెల్జియం, చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, US 7వ స్థానంలో ఉన్నాయి (187 గమ్యస్థానాలు). ఆస్ట్రేలియా, కెనడా, గ్రీస్, మాల్టా 8వ స్థానంలో (186 గమ్యస్థానాలు), హంగేరి, పోలాండ్ 9వ స్థానంలో (185 గమ్యస్థానాలు), లిథువేనియా, స్లోవేకియా 10వ స్థానంలో (184 గమ్యస్థానాలు) ఉన్నాయి. కువైట్ స్కోర్ 57 (97 గమ్యస్థానాలు), ఖతార్ స్కోర్ 56 (100 గమ్యస్థానాలు) వ స్థానంలో నిలిచాయి. ఆసియా దేశాలు ఇండెక్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, గల్ఫ్ దేశాల పాస్‌పోర్ట్‌ల సంఖ్య పెరగడం రాబోయే సంవత్సరంలో కీలకమైన ట్రెండ్‌గా గుర్తించబడిందని హెన్లీ & పార్ట్‌నర్స్ నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!