2027 ఆసియా కప్: నిర్వహణ బిడ్ గెలిచిన సౌదీ అరేబియా
- February 02, 2023
మనామా : సౌదీ అరేబియా మొట్టమొదటిసారిగా ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురుషుల జాతీయ జట్టు టోర్నమెంట్ - AFC ఆసియా కప్ 2027 నిర్వహణ హక్కులను గెలుచుకుంది. బుధవారం మనమాలో జరిగిన 33వ AFC కాంగ్రెస్ లో ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. సౌదీ అరేబియా ఫిబ్రవరి 6, 2020న AFC ఆసియా కప్ 19వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి తన బిడ్‌ను సమర్పించింది. టోర్నమెంట్‌ను 2023లో నిర్వహించే హక్కుల పోటీ నుంచి ఖతార్ వైదలగడంతో భారతదేశం, సౌదీ అరేబియా మధ్య తుది పోటీ జరిగింది. మొత్తం 24 ఆసియా దేశాల నుంచి జాతీయ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. సౌదీ అరేబియా మూడు పర్యాయాలు (1984, 1988, 1996) ఛాంపియన్‌గా నిలిచి, అపారమైన అనుభవాన్ని సాధించింది. AFC కాంగ్రెస్ నిర్ణయంపై సౌదీ క్రీడా మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టర్కీ అల్-ఫైసల్ మాట్లాడుతూ.. 2027 ఆసియా కప్‌కు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ , ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ నుండి పూర్తి మద్దతుగా నిలిచారని, ధన్యవాదాలు తెలిపారు. అభిమానులందరికీ చిరస్మరణీయమైన గొప్ప టోర్నమెంట్‌ను నిర్వహించడమే కాకుండా ఆసియా అంతటా గేమ్‌ను అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామన్నారు. ఈ టోర్నమెంట్ దేశవ్యాప్తంగా ఉన్న యువకులకు, బాలికలకు క్రీడలలో పాల్గొనడానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక క్షణానికి సహాయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సౌదీ అరేబియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) అధ్యక్షుడు యాసర్ అల్ మిసెహల్.. బిడ్‌కు మద్దతు ఇచ్చినందుకు రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!