కువైట్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- February 02, 2023
కువైట్ : కువైట్ చరిత్రలోనే తొలిసారిగా భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారులు దాదాపు 15 మిలియన్ల లిరికా (ప్రీగాబాలిన్) మాత్రలు, ముడి పౌడర్ రూపంలో అర టన్ను ఔషధాలను స్వాధీనం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి, తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు అధికారులు ఒక భారీ మత్తుపదార్థాల నిల్వ కేంద్రంపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ స్థావరాన్ని అంతర్జాతీయ ముఠా నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. క్యాప్సూల్స్‌లో ప్యాక్ చేసి విక్రయించే డ్రగ్‌తో పాటు పౌడర్ రూపంలో టాబ్లెట్లను ఈ ముఠా తయారు చేస్తుందని తెలిపారు. సంఘటనా స్థలంలో నలుగురిని అరెస్టు చేశామన్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!