లోకేష్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

- February 02, 2023 , by Maagulf
లోకేష్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈరోజు 7వ రోజుకు చేరింది. 7 రోజు వైస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పలమనేరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతులు లేకుండానే వాహానాన్ని తీసుకొచ్చారని పోలీసులు ఆరోపించారు.

ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. మరోవైపు నారా లోకేష్ యాత్రకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పాదయాత్రలో భాగంగా న్యాయవాదులు, ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు, ఆర్యవైశ్య నాయకులతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేష్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. ఫ్లైఓవర్ మీదుగా అభిమానులు పూల వర్షం కురిపించారు. పార్టీ సీనియర్ నాయకుల ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేష్, కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. చరణ్ డాభా ప్రాంతంలో లోకేష్ న ఎంఎస్ఎంఈ యూనియన్ ప్రతినిధులు కలిశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com