హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకున్న E-రేసింగ్ కార్లు
- February 02, 2023
హైదరాబాద్: ఫార్ములా E ఛాంపియన్‌షిప్ హైదరాబాద్‌కు వచ్చింది! దేశంలోనే మొట్టమొదటి ఈ-ప్రిక్స్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమైంది.ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించడంలో GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) బృందం కీలక పాత్ర పోషించింది.విమానాశ్రయంలోని కార్గో విభాగానికి 90 టన్నుల రేసింగ్ కార్ల భాగాలు చేరుకున్నాయి. నిన్న రాత్రి (ఫిబ్రవరి 1) 11.50 గంటలకు రియాద్ నుండి బోయింగ్ 747-400 చార్టర్ విమానం ద్వారా ఆటో విడిభాగాలు హైదరాబాద్ కార్గో టెర్మినల్‌కు చేరుకున్నాయి. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల భాగాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి గ్లోబల్ మోటార్‌స్పోర్ట్, ఫార్ములా-E వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 11 జట్లు పోటీ పడుతున్నాయి, నగరంలో ఇంతకు ముందెన్నడూ చూడని ఆల్-ఎలక్ట్రిక్ అద్భుతమైన మోటో కార్లతో ఉత్సాహాన్ని నింపుతాయి.
ఆటో విడిభాగాలకు చెందిన 83 బాక్స్‌లతో కూడిన కార్గో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్లాట్ల వద్ద నిలిపిన విమానం నుండి ఆఫ్‌లోడ్ చేసారు. వాటిని అన్ లోడింగ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన కార్గో హ్యాండ్లింగ్ పరికరాలను ఉపయోగించి, GHAC టెర్మినల్‌లోని ప్రత్యేకమైన హ్యాండ్లింగ్ ప్రాంతానికి తరలించారు. రేసింగ్ కార్ల కార్గో బదిలీ కోసం ఆప్రాన్ నుండి ల్యాండ్‌సైడ్ వరకు ఒక ప్రత్యేకమైన గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసారు. వివిధ టచ్ పాయింట్‌లలో వేగవంతమైన ఆన్‌సైట్ కస్టమ్ క్లియరెన్స్ తో విడి భాగాలకు వేగంగా అనుమతులు మంజూరు చేయడం జరిగింది. E-ఫార్ములా బృందానికి సహాయం చేయడానికి, షిప్‌మెంట్ ప్రక్రియ సమర్థవంతమైన నిర్వహణ కోసం హైదరాబాద్ కార్గో వారు ఒక మల్టీ-స్టేక్‌హోల్డర్ క్రాక్ టీమ్ ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా GHIAL CEO ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “దేశంలో మొట్టమొదటి ఫార్ములా E ఛాంపియన్‌షిప్ కోసం నిరాటంకమైన ఎయిర్ కార్గో సదుపాయాలను అందించడంలో హైదరాబాద్ విమానాశ్రయం పాత్ర పోషించడం గర్వంగా ఉంది. దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన కార్గో హబ్‌గా, హైదరాబాద్ టెంపరేచర్-సెన్సిటివ్ వస్తువులు, భారీ యంత్రాలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, పశువులు, జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌లలో సురక్షితంగా రవాణా చేయబడే అనేక ఇతర వస్తువుల రవాణాను నిర్వహిస్తోంది. ఈ కన్సైన్‌మెంట్ నిర్వహణ ఆటో సెక్టార్ అవసరాలను తీర్చే మా సామర్థ్యాలను తెలియజేస్తుంది. మా కార్గో సౌకర్యాల మరింత విస్తరించి, డిజిటలైజేషన్‌తో మేము వినియోగదారులకు మా సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాము.’’ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!