తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

- February 03, 2023 , by Maagulf
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు సభ ప్రారంభమైంది. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ప్రసంగిస్తున్నారు.

కాగా, అనంతరం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన రెండుచోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి? వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లోనే సోమవారం (ఈ నెల 6న) 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com