అబుధాబి-కేరళ ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
- February 03, 2023
అబుధాబి: ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది.విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం శుక్రవారం ఉదయం అబుధాబి నుంచి కేరళలోని కాలికట్ (కోజికోడ్)కు బయల్దేరింది. టేకాఫ్ అయిన విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి అబుధాబి విమానాశ్రయంలో సుక్షితంగా ల్యాండ్ చేశారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.ప్రమాద సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







