ఇ-సిగరెట్లు సురక్షితం కాదు.. హెచ్ఎంసీ హెచ్చరిక
- February 05, 2023
దోహా: ఇ-సిగరెట్లు, ఇ-హుక్కా వంటి ఎలక్ట్రానిక్ ధూమపానానికి వ్యతిరేకంగా హమద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) పొగాకు నియంత్రణ కేంద్రం హెచ్చరించింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడం వల్ల వెలువడే పొగలో వినియోగదారులకు హాని కలిగించే విషపూరిత రసాయన పదార్థాలు ఉన్నాయని వ్యాధుల నియంత్రణ సీనియర్ కన్సల్టెంట్, HMC పొగాకు నియంత్రణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ ముల్లా తెలిపారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ ధూమపానం అనేది ధూమపానం మానేయడానికి ప్రత్యామ్నాయ మార్గం కాదన్నారు. దీనికి శాస్త్రీయత లేదని ఆయన తెలిపారు. HMCలోని పొగాకు నియంత్రణ కేంద్రం నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఖతార్లో పొగాకు వినియోగదారులలో ఎలక్ట్రానిక్ సిగరెట్ వినియోగం దాదాపు 11 శాతం ఉందని డాక్టర్ అల్ ముల్లా వెల్లడించారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగేవారు నోటిలో ఇన్ఫెక్షన్లు, చిగుళ్ళు, దంతాలు, శ్వాసనాళాలు దెబ్బతినడం, గుండె - ఛాతీలో నొప్పులు వంటి అనేక సమస్యల వస్తాయని పొగాకు విరమణ నిపుణుడు డాక్టర్ జమాల్ బా సుహై హెచ్చరించారు. ధూమపానం మానేయాలనుకునే వ్యక్తులు HMC పొగాకు నియంత్రణ కేంద్రంలో సహాయం పొందాలని, సురక్షితమని నిరూపించబడిన మందులను స్వీకరించాలని అలాగే అధిక శిక్షణ పొందిన బృందం నుండి సలహాలు, మద్దతును పొందాలని డాక్టర్ జమాల్ బా సుహై సూచించారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్