యూఏఈలో సెలవులు: త్వరలో 6 రోజుల వీకెండ్

- February 05, 2023 , by Maagulf
యూఏఈలో సెలవులు: త్వరలో 6 రోజుల వీకెండ్

యూఏఈ: సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి లేదా మంచులో సాహసయాత్రకు వెళ్లాలని అనుకునే వారికి రాబోయే ఆరు రోజుల వారాంతం సరైన సమయం కావచ్చు. విదేశాలకు ప్రయాణించడం ద్వారా తదుపరి సుదీర్ఘ విరామాన్ని పెంచుకోవాలని యోచిస్తున్న కుటుంబాలు సిద్ధమైపోండి. అయితే, పెద్ద సెలవుల సమయంలో విమాన ఛార్జీలు సాధారణంగా 150 శాతం వరకు పెరుగుతాయి కాబట్టి ముందుగానే టిక్కెట్లు, డీల్‌ల కోసం ప్రయత్నించండి. కొంతమంది నిపుణులు ట్రావెల్ హ్యాక్‌లను కూడా అందించారు, తద్వారా ఫ్లైయర్‌లు చౌకైన విమాన టిక్కెట్‌లను పొందవచ్చు. నివాసితులకు ఈ సంవత్సరం అనేక వారంతాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆరు రోజుల పాటు కొనసాగవచ్చు. ఈద్ అల్ ఫితర్, అరఫా డే, ఈద్ అల్ అదా, హిజ్రీ న్యూ ఇయర్,  ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజున సుదీర్ఘ వారంతాలు రాబోతున్నాయి. జాబితాలో పేర్కొన్న కొన్ని సెలవులు హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్‌పై ఆధారపడి ఉంటాయన్న విషయం మరవొద్దు.  యూఏఈ అధికారిక జాబితా ప్రకారం ఈ సంవత్సరం నాలుగు లాంగ్ వీకెండ్లు రాబోతున్నాయి.

– ఈద్ అల్ ఫితర్: హిజ్రీ క్యాలెండర్ ప్రకారం, తేదీలు రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు ఉంటాయి. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, ఇది ఏప్రిల్ 20 గురువారం నుండి ఏప్రిల్ 23 ఆదివారం వరకు ఉంటుంది. చంద్రుని వీక్షణకు అనుగుణంగా తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.

– అరాఫా డే,  ఈద్ అల్ అధా: ఇది చాలా మటుకు ఆరు రోజుల విరామాన్ని అందిస్తుంది. జూన్ 27, మంగళవారం నుండి శుక్రవారం, జూన్ 30 వరకు విరామం ఉండే అవకాశం ఉంది. ఇది నిజమైతే, శనివారం-ఆదివారం సెలవు ఉన్న వారికి ఆరు రోజుల వారాంతం లభిస్తుంది.

– హిజ్రీ నూతన సంవత్సరం: జూలై 21 శుక్రవారం. ఇది శని-ఆదివారం సెలవు ఉన్న వారికి మూడు రోజుల వారాంతం అవుతుంది.

- ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు: సెప్టెంబర్ 29 శుక్రవారం. ఇది నివాసితులకు మూడు రోజుల వారాంతం అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com