చవులూరించే మ్యాంగో రైస్

- June 19, 2015 , by Maagulf
చవులూరించే మ్యాంగో రైస్

ఎలాంటి వారికైనా మ్యాంగోని చూస్తే నోరూరక మానదు. మామిడి పండే కాదు, మామిడి కాయ కూడా నోరూరిస్తుంది. మరి మామిడికాయతో ఘుమఘులాడే మ్యాంగోరైస్‌ సులువుగా తయారుచేసేస్తే ఇంకేముంది పిల్లలు, పెద్దలు డైనింగ్‌ టేబుల్‌ వద్ద రెడీ అయిపోరూ. నోరూరించే మ్యాంగో రైస్‌ ఎలా తయారు చెయ్యాలో చూసేద్దాం.
కావలసిన పదార్ధాలు ఇవీ
పచ్చి మామిడికాయలు - 1
ఉడికించిన అన్నం - 2 కప్పులు
ఆవాలు, జీలకర్ర, మినపప్పు - కొద్దిగా(తాలింపు కోసం)
పల్లీలు, పచ్చి శనగపప్పు - అర చెంచా చొప్పున
ఉప్పు - చాలినంత
పసుపు - చిటికెడు
కొబ్బరి తురుము - 2 చెంచాలు
క్యారెట్‌ తురుము - 2 చెంచాలు
కొత్తిమీర - గార్నిష్‌ కోసం
ఆయిల్‌ - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా అన్నం ఉడికించి పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి తాలింపు సామాన్లు, పల్లీలు, పచ్చి శనగపప్పు వేసి వేయించాలి. అప్పుడు సన్నగా తరిగిన అల్లం తురుము, క్యారెట్‌ తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్డిగా వేయించి, తరువాత పచ్చిమామిడి తురుము లేదా మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసిన మిశ్రమాన్ని కూడా వేసి, పసుపు, ఉప్పు వేసి, ఇప్పుడు ఉడికించి పెట్టిన అన్నం కూడా వేసి బాగా కలపాలి. చివరిగా ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే వేడి వేడిగా ఘుమఘుమలాడే మ్యాంగోరైస్‌ తినడానికి రెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com