సైబరాబాద్ సీపీఓలో 'కంటి వెలుగు' వైద్య శిబిరం ప్రారంభం
- February 06, 2023
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెండో దఫా ‘కంటి వెలుగు’ వైద్య శిబిరాన్ని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని సీటీసీలో ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించి కంటి పరీక్షల తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘కంటి వెలుగు’ పథకాన్ని రూపొందించాన్నారు.కమీషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం వారి ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం సైబరాబాద్ సీపీ ఆఫీసులోని సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి కళ్లద్ధాలు అందించడం, చికిత్స నిర్వర్తిస్తారన్నారు. 5 రోజులపాటు కొనసాగే కంటి వెలుగు కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుందన్నారు. ప్రతీరోజు 250 మంది సిబ్బందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున సిబ్బంది అందరూ ఈ రెండో దఫా కంటి వెలుగు వైద్య శిబిరాన్నిసద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆఫీసర్ (రంగారెడ్డి జిల్లా) డాక్టర్ రాకేశ్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని పౌరులందరికీ కంటి స్క్రీనింగ్, విజన్ పరీక్షను నిర్వహించడం, కళ్ల జోళ్లను ఉచితంగా సమకూర్చడం, సర్జరీలు, ఇతర చికిత్సలను ఉచితంగా ఏర్పాటు చేయడం, సాధారణ కంటి వ్యాధులకు మందులను సమకూర్చడం, హానికరమైన కంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్ధాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీ తో పాటు సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసిపి రియాజ్, సిటిసి ప్రిన్సిపాల్ ఏడిసిపి రామచంద్రుడు, ఏడిసిపి శ్రీనివాస రావు,కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆఫీసర్ (రంగారెడ్డి జిల్లా) డాక్టర్ రాకేశ్, ఏసీపీ కృష్ణ,ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య, రంగారెడ్డి డీఎమ్ హెచ్ఓ డాక్టర్ సృజన, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాకేశ్,కంటి వెలుగు అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ రాము, ఆర్ఐలు వెంకటస్వామి, అరుణ్, సీటీసీ వైద్యులు డాక్టర్ సరిత, డాక్టర్ సుకుమార్,సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!