ముస్లిమేతరుల కోసం మరిన్ని శ్మశానవాటికలు: సౌదీ

- February 06, 2023 , by Maagulf
ముస్లిమేతరుల కోసం మరిన్ని శ్మశానవాటికలు: సౌదీ

సౌదీ:ముస్లిమేతరుల కోసం వారి ప్రాంతాలలో శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని సౌదీ మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి మృతదేహాలను గతంలో మాదిరిగానే జెడ్డా గవర్నరేట్‌లో ఉన్నటువంటి పరిమిత సంఖ్యలో శ్మశానవాటికలకు తరలించే బదులు వారి అంత్యక్రియల ప్రక్రియను స్థానికంగానే నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు శ్మశానవాటికల అభివృద్ధి చేసే యంత్రాంగానికి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని సీనియర్ నిపుణులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ముస్లిమేతరులలో మరణించిన వారి కోసం సమాధులను సిద్ధం చేయడానికి, అలాగే మరణించిన వారి బంధువులు ఎలక్ట్రానిక్ సేవల ద్వారా ఖనన ధృవీకరణ పత్రాలను సులభంగా, సరళమైన మార్గంలో పొందేలా చేయడానికి మేయర్‌లటీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలను సాధారణంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆసుపత్రులే నిర్వహిస్తాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com