షేక్ మొహమ్మద్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ: కొత్తవారికి చోటు

- February 08, 2023 , by Maagulf
షేక్ మొహమ్మద్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ: కొత్తవారికి చోటు

దుబాయ్: ఫెడరల్ ప్రభుత్వంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆశీర్వాదంతో యూఏఈలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రిగా షమ్మా బింట్ సుహైల్ అల్ మజ్రోయీని నియమించామని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తెలిపారు. అలాగే సాంస్కృతిక, యువజన మంత్రిగా సలేం బిన్ ఖలీద్ అల్ ఖాసిమి, రాష్ట్ర మంత్రిగా హెస్సా బుహుమైద్‌,  నౌరా అల్ కాబీని ఫెడరల్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా నియమించినట్లు ప్రకటించారు. యూఏఈ ప్రభుత్వంలో మంత్రి మండలి సెక్రటరీ జనరల్ అయిన మరియం బింట్ అహ్మద్ అల్ హమ్మదీని రాష్ట్ర మంత్రిగా నియమించారు. ప్రధాన మంత్రి కార్యాలయానికి డైరెక్టర్ జనరల్‌గా ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిగా ప్రస్తుత విధులకు అదనంగా అబ్దుల్లా నాసర్ లూతాను చైర్మన్‌గా నియమించారు. కొత్త మంత్రులు వారికి అప్పగించిన బాధ్యతలను విజయవంతం చేయాలని దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com