వందలాది ఉద్యోగుల్ని తొలగిస్తున్న EBay..
- February 08, 2023
ప్రముఖ ఈకామర్స్ కంపెనీఈబే 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏదో విధంగా నెట్టుకొచ్చిన కంపెనీలు ఆ ప్రభావం తాజాగా పడటానికి తోడు ఆర్థిక సంక్షోభం వెరసి ఉద్యోగుల కోత విధిస్తున్నాయి పలు కంపెనీలు. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఈబే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ మంగళవారం (ఫిబ్రవరి 7,2023) ప్రకటించారు. 4 శాతం ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈబే కంపెనీ సీఈఓ జామీ ఇయానోస్ తెలిపారు.
1995లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించబడిన ఈబే ఈకామర్స్ అమ్మకాలు, కొనుగోలు ప్లాట్ ఫామ్ గా ఉంది. ఎలక్ట్రానిక్స్,ఫ్యాషన్ ప్రొడక్ట్స్ నుంచి గిఫ్టు ఆర్టికల్స్ తో పాటు అనేక రకాల ఉత్పత్తులు ఈబేలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.
డెల్ కంపెనీ,జూమ్ కంపెనీ కూడా ఉద్యోగుల కోత విధించాయి. జూమ్ 1300ల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రటించింది. అలాగే డెల్ 6,600 ఉద్యోగాలను తగ్గించింది. అమ్మకాలు క్షీణించి ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ వివరించింది. అలాగే ఈకామర్స్ కంపెనీ అమెజాన్ ఏకంగా 18వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా ఈ కంపెనీ ఈ కంపెనీ అనిలేదు ఉద్యోగుల కోత ప్రకటనల్ని మోతెక్కిస్తున్నాయి. ఆయా కంపెనీల ప్రకటనలతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







