ట్రాఫిక్ రిడక్షన్ ప్రోగ్రామ్ కింద లబ్ధిపొందిన 1,680 మంది డ్రైవర్లు

- February 08, 2023 , by Maagulf
ట్రాఫిక్ రిడక్షన్ ప్రోగ్రామ్ కింద లబ్ధిపొందిన 1,680 మంది డ్రైవర్లు

యూఏఈ: 2022లో పోలీసుల  చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ‘ట్రాఫిక్ రిడక్షన్ ప్రోగ్రామ్’ కింది అబుధాబిలో దాదాపు 1,680 మంది డ్రైవర్లు తమ బ్లాక్ పాయింట్‌లను తగ్గించుకోగలిగారు. అదే విధంగా చాలామంది తమ జప్తు చేసిన లైసెన్స్‌లను కూడా తిరిగి పొందగలిగారు. సురక్షితమైన డ్రైవింగ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొంతకాలం క్రితం ప్రవేశపెట్టిన  ట్రాఫిక్ రిడక్షన్ ప్రోగ్రామ్ వాహనదారులకు ఎలా ఉపయోగపడిందో అబుధాబి పోలీసులు వెల్లడించారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు వాహన డ్రైవర్లకు బ్లాక్ పాయింట్లు విధించబడతాయి. ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ 24 బ్లాక్ పాయింట్లను పొందినట్లయితే అతని లేదా ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని లేదా జప్తు చేయాలని ట్రాఫిక్ కోర్టు ఆదేశించే అవకాశం ఉంది. కాగా, కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు  బ్లాక్ పాయింట్లు 24 కంటే తక్కువగా ఉన్నప్పటికీ వాహనాలను స్వాధీనం చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ రిడక్షన్ ప్రోగ్రామ్ పనితీరు ఇలా
గరిష్ఠంగా 24 బ్లాక్‌ పాయింట్లు సాధించిన డ్రైవర్లు అవగాహన తరగతుల్లో చేరవచ్చని,  ఇందులో మూడు కార్యక్రమాలు ఉంటాయని అబుధాబి పోలీసులు తెలిపారు. మొదటి పథకం డ్రైవర్లకు ఎనిమిది నుండి 23 బ్లాక్ పాయింట్లు పొందిన వారు కోర్సులో చేరి ఉత్తీర్ణులైతే సంవత్సరానికి గరిష్టంగా ఎనిమిది పాయింట్లను తగ్గిస్తారు. 24 బ్లాక్ పాయింట్లు,  వారి డ్రైవింగ్ లైసెన్స్ ఉపసంహరించుకున్న డ్రైవర్లకు  రెండవ ప్రోగ్రామ్ కింద  ప్రయోజనం పొందవచ్చు. మూడవది కారు జప్తు ఆర్డర్ పొందిన వాహనదారుల కోసం నిర్దేశించారు. అరబిక్, ఇంగ్లీష్,  ఉర్దూలో తరగతులు ముసఫాలో పోలీసు విభాగం,  అల్ దఫ్రా ప్రాంతంలోని జాయెద్ సిటీలో పోలీస్ ఫాలో-అప్ విభాగం,  అల్ ఐన్‌లోని 'మొరవాబ్ అల్ ఖదీమ్' భవనంలో పోలీసు ఫాలో-అప్ విభాగాలలో నిర్వహించే తరగతులలో పాల్గొనవచ్చు. వాహనదారులు 8003333కు డయల్ చేసి తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. ఈ కార్యక్రమం రోడ్లపై డ్రైవర్ల ప్రవర్తనను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అబుధాబి పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com