* ఆండ్రాయిడ్‌ యూజర్లకు 'కాల్‌ బ్యాక్‌' ఫీచర్‌ ..

- May 02, 2016 , by Maagulf
* ఆండ్రాయిడ్‌ యూజర్లకు 'కాల్‌ బ్యాక్‌' ఫీచర్‌ ..

 ఫేస్‌బుక్‌కి చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇటీవల వరసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంది. మరి కొద్ది వారాల్లో ఇంకొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫోన్‌రాడార్‌ సంస్థ నివేదికల ఆధారంగా వాట్సాప్‌లో త్వరలో వచ్చే అప్‌డేట్‌ ద్వారా ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. * ఆండ్రాయిడ్‌ యూజర్లకు 'కాల్‌ బ్యాక్‌' ఫీచర్‌ రానుంది. వాట్సాప్‌ లోపలికి వెళ్లకుండా ఫోన్‌లో మిస్డ్‌ కాల్‌ అంటూ వచ్చే నోటిఫికేషన్‌ దగ్గరే ఈ కాల్‌ బ్యాక్‌ బటన్‌ అందుబాటులోకి రానుంది.* ఐఓఎస్‌ డివైజ్‌ల్లో వాయిస్‌ మెయిల్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది.దీంతో 'రికార్డ్‌ వాయిస్‌ మెయిల్‌', 'సెండ్‌ వాయిస్‌ మెయిల్‌' బటన్లు వాటిలో కొత్తగా వచ్చి చేరనున్నాయి. * అలాగే జిప్‌ ఫైల్స్‌ సపోర్ట్‌ వాటి షేరింగ్‌కి వీలుగా కొత్త ఫీచర్‌ రానుంది. డాటా వాడకాన్ని తగ్గించి ఎక్కువ ఫైల్స్‌ని పంపించేందుకు వీలుగా ఈ కంప్రెస్డ్‌ జిప్‌ ఫైల్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్‌ ఇప్పటికే ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ని పరిచయం చేసి యాప్‌లో షేర్‌ చేసే ఫైల్స్‌ అన్నీ భద్రంగా ఉంటాయని ప్రకటించింది. అలాగే ఇటీవల పీడీఎఫ్‌ ఫైల్‌ సపోర్ట్‌ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com