జెడ్డాలో రైల్వే ట్రాక్ వద్ద కారు ప్రమాదం.. పలువురికి గాయాలు
- February 09, 2023
జెడ్డా : జెడ్డాలోని హరమైన్ రైల్వే ట్రాక్ వెలుపల కారు ప్రమాదం జరిగింది. కారు వంతెనపై నుండి పడి మంటలు చెలరేగిన ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు జెడ్డా గవర్నరేట్‌లోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్ (తహ్లియా) కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు హరమైన్ హై-స్పీడ్ రైలు ఒక ప్రకటనలో తెలిపింది. ఎటువంటి మరణాలు సంభవించలేదని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. ఈ ప్రమాదం రైళ్ల రాకపోకలపైనా, రైలు ప్రయాణాల షెడ్యూల్‌పైనా ప్రభావం చూపలేదని, మరమ్మతు పనులు ప్రారంభించినట్లు ప్రకటనలో అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







