సిరియా, టర్కీలకు dhs50 మిలియన్లు ప్రటించిన షేఖా ఫాతిమా
- February 10, 2023
యూఏఈ: భూకంప ధాటికి తీవ్రంగా నష్టపోయిన టర్కీ, సిరియాలకు హర్ హైనెస్ షేఖా ఫాతిమా బింట్ ముబారక్, జనరల్ ఉమెన్స్ యూనియన్ (GWU), సుప్రీం కౌన్సిల్ ఫర్ మదర్‌హుడ్ అండ్ చైల్డ్‌హుడ్ చైర్‌వుమన్, ఫ్యామిలీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సుప్రీం చైర్‌వుమన్, ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ERC) గౌరవ అధ్యక్షురాలు షేఖా ఆపన్న హస్తం అందజేశారు. సిరియా, టర్కీలో భూకంప బాధిత ప్రజల కోసం కొనసాగుతున్న మానవతా, సహాయక చర్యలకు మద్దతుగా ERC ప్రారంభించిన బ్రిడ్జ్ ఆఫ్ గుడ్నెస్ ప్రచారానికి మద్దతుగా శరణార్థి మహిళల కోసం ఫాతిమా ఫండ్ 50 మిలియన్ దిర్హామ్ లను అందించనున్నట్లు ప్రకటించారు. వేలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన భూకంపాల పరిణామాలను తగ్గించడానికి యూఏఈ నాయకత్వ చేపట్టిన కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగుతుందని షేఖా ఫాతిమా పేర్కొన్నారు. విపత్తుల సమయంలో యూఏఈ మానవతా చొరవ బాధితులకు కొంతైనా సాంత్వన కలిగిస్తుందన్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







