రోడ్లపై నిర్లక్ష్య డ్రైవింగ్.. 800 దిర్హామ్‌ల జరిమానా.. పోలీసుల హెచ్చరిక

- February 10, 2023 , by Maagulf
రోడ్లపై నిర్లక్ష్య డ్రైవింగ్.. 800 దిర్హామ్‌ల జరిమానా.. పోలీసుల హెచ్చరిక

అబుధాబి: రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పరధ్యానంలో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణం కావద్దని వాహనదారులను అబుధాబి పోలీసులు హెచ్చరించారు. రహదారిపై వాహనదారుడు పరధ్యానంలో ఉన్నప్పుడు జరిగే ట్రాఫిక్ ప్రమాదం గురించే తెలిపే వీడియోను కంట్రోల్ అండ్ ఫాలో-అప్ సెంటర్ సహకారంతో అథారిటీ షేర్ చేసింది. డ్రైవింగ్ చేసేటప్పుడు తమ ఫోన్‌ను ఉపయోగించవద్దని వాహనదారులను హెచ్చరించారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో ఇంటర్నెట్‌లో సర్ఫ్ చేయడం, సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం, కాల్ చేయడం లేదా ఫోటోలు తీయడం లాంటివి చేయవద్దని.. ఇలా ప్రవర్తించడం ప్రమాదాలకు దారితీస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనకు జరిమానా 800 దిర్హామ్‌లు,  నాలుగు ట్రాఫిక్ పాయింట్‌లను విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com