యూఏఈలో రమదాన్ 2023: ఉపవాస, ఇఫ్తార్ సమయాలు ఖరారు
- February 11, 2023
యూఏఈ: జనరల్ అథారిటీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్ వెబ్సైట్లో ప్రచురితమైన ప్రార్థన సమయాల ప్రకారం.. పవిత్ర రమదాన్ మాసం మొదటి రోజున యూఏఈ నివాసితులు 13 గంటలకు పైగా ఉపవాసం ఉంటారు. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, రమదాన్ మార్చి 23న ప్రారంభమవుతుంది. ఆ రోజున, ఫజ్ర్ (ఉదయం) ప్రార్థనలు ఉదయం 5:02 గంటలకు.. మగ్రిబ్ ప్రార్థనలు (సూర్యాస్తమయం) సాయంత్రం 6:35 గంటలకు ప్రారంభమవుతాయి. మొత్తం ఉపవాస సమయం 13 గంటలు, 33 నిమిషాలు ఉంటుంది. అలాగే ఏప్రిల్ 20న ఫజ్ర్ నమాజులు ఉదయం 4:31 గంటలకు.. మగ్రిబ్ సాయంత్రం 6:47 గంటల వరకు ఉంటుంది. ఉపవాస సమయాలు 14 గంటల 16 నిమిషాలపాటు ఉంటుంది. గత సంవత్సరం రమదాన్ మొదటి రోజు ఉపవాసం 13 గంటల 48 నిమిషాల పాటు కొనసాగింది. చివరి రోజు 14 గంటల 33 నిమిషాలపాటు కొనసాగింది. పవిత్ర మాసం 29 లేదా 30 రోజుల పాటు కొనసాగుతుంది. చంద్రుడిని చూసి నిర్ణయించే కమిటీ రమదాన్ ఉపవాస సమయాల ప్రారంభం, ముగింపును నిర్ణయిస్తుంది.
రమదాన్ లో రెండు ప్రధాన భోజనాలు ఉన్నాయి.సుహూర్.. సూర్యోదయానికి ముందు చేసే భోజనం కాగా.. ఇఫ్తార్ అనేది సూర్యాస్తమయం తర్వాత తీసుకునే భోజనం. రమదాన్ సందర్భంగా రెస్టారెంట్లు తెరిచి ఉంటాయి, కానీ బహిరంగంగా తినడానికి లేదా తాగడానికి అనుమతించబడదు. చట్టం ప్రకారం.. పని గంటలు, పాఠశాల రోజులు కూడా రమదాన్ మాసంలో తగ్గించబడతాయి.రమదాన్ సాధారణంగా 29 లేదా 30 రోజులపాటు ఉంటుంది. ఎమిరేట్స్ ఆస్ట్రానమీ సొసైటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ ఇటీవల అరబిక్ డైలీ ఎమారత్ అల్ యూమ్తో మాట్లాడుతూ..రమదాన్ కు కొత్త నెలవంక మార్చి 21( మంగళవారం) రాత్రి 21:23 గంటలకు మొదలవుతుందని, మరుసటి రోజు అది పశ్చిమ హోరిజోన్ నుండి 10 డిగ్రీలు, 50 నిమిషాల తర్వాత అస్తమయం అవుతుందని తెలిపారు. హిజ్రీ 1444 సంవత్సరానికి సంబంధించి రమదాన్ నెల మొదటి రోజు మార్చి 23, 2023 గురువారం నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







