సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు
- February 13, 2023
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఈరోజు ఉదయం కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా పదవి పొందిన జస్టిస్ రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్‌లతో భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డీవీ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో, సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందకముందు జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా, జస్టిస్ కుమార్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వీరి రాకతో తొమ్మిది నెలల విరామం తర్వాత సుప్రీంకోర్టు పూర్తి స్థాయికి చేరుకుంది. అంతకుముందు ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఈ ఐదుగురు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో జస్టిస్‌లు పంకజ్ మిథాల్, సంజయ్ కరోల్, పీవీ సంజయ్ కుమార్, అహ్సానుద్దీన్ అమానుల్లా, మనోజ్ మిశ్రాలతో ప్రమాణం చేయించారు. డిసెంబర్ 13న సుప్రీంకోర్టు కొలీజియం వారి పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేశారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







