ఒమన్‌లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం.. నలుగురు అరెస్ట్
- February 13, 2023
మస్కట్: అంతర్జాతీయ ముఠాల సహకారంతో సుల్తానేట్‌లోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. “జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్ టీం సముద్రం ద్వారా దేశంలోకి అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. 20 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మత్తుమందు, 17 కిలోల మార్ఫిన్ కలిగి ఉన్న ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు." అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. దీంతోపాటు నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేసిందని పేర్కొంది. అతని వద్ద ఉన్న క్రిస్టల్, హషీష్ , వివిధ సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రెండు కేసుల్లో నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ROP తెలిపింది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







