ఈ పండ్లు రెగ్యలర్‌గా మీ డైట్‌లో వుంటున్నాయా.?

- February 13, 2023 , by Maagulf
ఈ పండ్లు రెగ్యలర్‌గా మీ డైట్‌లో వుంటున్నాయా.?

కొన్ని పండ్లకు యాంటీ ఏజింగ్ శక్తి వుంటుంది.ఆ పండ్లను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఏజ్‌తో పాటూ వచ్చే కొన్ని కీలకమైన మార్పులూ, కొన్ని అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకునే అవకాశముంటుంది.అంతేకాదు, ఏజ్ పరంగా వచ్చే చర్మం పై ముడతల్ని సైతం తగ్గించే శక్తి వుంటుందట.ఆ పండ్లను డైలీ తినడం మర్చిపోకండి మరి.

యాపిల్, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నిమ్మకాయ తదితర పండ్లను తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.సిట్రస్ జాతికి చెందిన నిమ్మపండులో విటమిన్ సి అధికంగా వుంటుంది. నిమ్మకాయను ఏ రూపంలో తీసుకున్నా చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది. అలాగే చర్మం పై వచ్చే ముడతలు కూడా తొలగించేందుకు తోడ్పడుతుంది.

యాపిల్‌లో ఎంజైములు అధికంగా వుంటాయి.చర్మం పై మెరుపును కలిగించేందుకు తొడ్పడతాయి.పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌తో పాటూ యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా వుండడం వల్ల చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది.పుచ్చకాయ స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.స్ట్రాబెర్రీ తీసుకోవడం వల్ల రక్తంలో కొల్లాజెన్స్ పెరిగి, చర్మం కాంతి వంతంగా మారడంతో పాటూ, యవ్వనంగా కనిపిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com