విజయ్‌కి కలిసి రాలేదు.! ధనుష్ ఏం చేస్తాడో.!
- February 13, 2023
ఈ మధ్య తమిళ హీరోలు తెలుగు డైరెక్టర్స్ మీదా, తెలుగు మార్కెట్ మీదా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే సంక్రాంతి సందర్భంగా తమిళ స్టార్ హీరో విజయ్ ‘వారసుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.స్ట్రెయిట్ మూవీగానే ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ, విజయ్‌కి తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు మరో తమిళ హీరో ధనుష్ వస్తున్నాడు. ‘సార్’ అనే సినిమా కోసం, తెలుగు హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ధనుష్ పని చేశాడు. వచ్చే శుక్రవారం అంటే ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విద్యా వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతూ, సందేశాత్మకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. బజ్‌తో సంబంధం లేకుండా, సినిమా కంటెంట్ నచ్చితే, తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు చూడాలి మరి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







