చైనా బెలూన్ల కలవరం..దేశ రక్షణ కోసం ఏం చేసేందుకైనా సిద్ధం: ప్రధాని రిషి
- February 14, 2023
లండన్: అమెరికాలో కలకలం రేపుతున్న చైనా నిఘా బెలూన్లు బ్రిటన్ను కూడా టార్గెట్ చేయవచ్చన్న వార్తల నడుమ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. అమెరికా గగనతలంలో నాలుగో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చిన కొద్ది గంటలకే రిషి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ప్రజలకు చెబుతున్నదేంటంటే.. బ్రిటన్ను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం’’ అని రిషి సునాక్ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.
అమెరికా ఇప్పటివరకూ తన గగనతలంలో అనుమానాస్పదంగా ఉన్న నాలుగు వస్తువులను కూల్చేసింది. అయితే.. మొదట కూల్చేసిన బెలూన్ అత్యాధునికమైన నిఘా బెలూన్ అని, దాన్ని చైనాయే ప్రయోగించిందని ప్రకటించింది. భారత్ సహా పలు దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా పలు బెలూన్లు సిద్ధం చేసిందన్న కథనం ఒకటి ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఇక బ్రిటన్ గగనతలంలో అనుమానాస్పద వస్తువులను యుద్ధ విమానాలతో కూల్చేందుకు తాము సిద్ధమేనని ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ‘‘అత్యవసర సమాయాల్లో వేగంగా స్పందించేందుకు క్విక్ యాక్షన్ రెన్సాన్స్ ఫోర్స్ సిద్ధం చేశాం’’ అని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







