మోసం, దొంగతనాలకు పాల్పడిన నిర్వాసితులు అరెస్టు
- February 14, 2023
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో షాపు యజమానులను మోసగించిన ఆరోపణలపై ఇద్దరు ప్రవాస మహిళలు, ఒక వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ పరిధిలో దుకాణయజమానులను మోసం చేసిన కేసులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరబ్ జాతీయులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులు ముందుగా కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఆ తర్వాత బిల్లింగ్ కూడా వేయించి.. ఆపై బిల్లు మొత్తాన్ని చెల్లించకుండానే ఆ వస్తువులను తిరిగి ఇచ్చేసి బిల్లు మొత్తాన్ని వాపస్ చేయాలని డిమాండ్ చేశారని పోలీసులు వివరించారు. మరో కేసులో నివాస భవనాల నుండి అనేక దొంగతనాలకు పాల్పడిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ అరెస్టు చేసిందని, అతడిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







