ప్రయాణికులు Dh60,000 దాటిన కరెన్సీ, ఆభరణాల వివరాలు చెప్పాల్సిందే: యూఏఈ

- February 15, 2023 , by Maagulf
ప్రయాణికులు Dh60,000 దాటిన కరెన్సీ, ఆభరణాల వివరాలు చెప్పాల్సిందే: యూఏఈ

యూఏఈ: Dh60,000 కంటే ఎక్కువగా ఉన్న కరెన్సీ, విలువైన అభరణాల వివరాలను యూఏఈకి వచ్చే లేదా వెళ్లే ప్రయాణికులందరూ తప్పనిసరిగా ప్రకటించాలని యూఏఈ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈమేరకు  యూఏఈలోని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ ప్రయాణికులకు రిమైండర్ జారీ చేసింది. సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి ప్రయాణికులందరూ కస్టమ్స్ చట్టం సూచించిన విధంగా కస్టమ్స్ విధానాలకు కట్టుబడి ఉండటం చాలా అవసరం అని అందులో పేర్కొన్నారు.  కాగా, యూఏఈ గుండా వెళ్లే ప్రయాణీకులకు నగదు పరిమితి లేదని.. అయితే Dh60,000 కంటే ఎక్కువ మొత్తాన్ని తప్పనిసరిగా ప్రకటించాలని అథారిటీ స్పష్టం చేసింది. యూఏఈలోని డిస్‌క్లోజర్ సిస్టమ్ ప్రకారం.. 18 ఏళ్లు పైబడిన ప్రతి కుటుంబ సభ్యుడు కస్టమ్స్‌కు వెల్లడించకుండా  Dh60,000 మించకుండా లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీని తీసుకువెళ్లే హక్కు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే  పిల్లలు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రయాణీకులు తీసుకువెళ్ళే నగదు, ఇతర విలువైన వస్తువులు, వారి తల్లిదండ్రులు లేదా వారితో పాటు వచ్చే పెద్దల కుటుంబ సభ్యుల పరిమితికి జోడించబడతాయని రిమైండర్ లో పేర్కొన్నారు. ICA వెబ్‌సైట్, స్మార్ట్ మొబైల్ అప్లికేషన్ ద్వారా నగదు, ఇతర ఆర్థిక సాధనాలు లేదా రాళ్ల విలువైన లోహాలను వివరాలను వెల్లడించేందుకు ఆన్‌లైన్ సిస్టమ్‌ను ప్రారంభించినట్లు యూఏఈ కస్టమ్ కస్టమ్ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com