నకిలీ సందేశాల వ్యాప్తి.. హెచ్చరించిన అంతర్గత మంత్రిత్వ శాఖ

- February 15, 2023 , by Maagulf
నకిలీ సందేశాల వ్యాప్తి.. హెచ్చరించిన అంతర్గత మంత్రిత్వ శాఖ

కువైట్: నకిలీ సందేశాల  వ్యాప్తిపై కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అలెర్టయింది.ఫేక్ ప్రకటనల పట్ల ప్రజలు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓ రోడ్డుపై ఉన్న మెసేజ్ బోర్డుకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ పై మంత్రిత్వ శాఖ స్పందించింది. అది ఫేక్ మెసేజ్ అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ ఫేక్ మెసేజ్ పంపిన వారిని సైబర్ సెల్ పంపినవారిని ట్రాక్ చేస్తుందని పేర్కొంది. అదే సమయంలో నకిలీ వార్తలను ప్రచురించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రోడ్డుకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఒరిజినల్, నకిలీ వార్తల స్క్రీన్‌షాట్‌లను ప్రచురించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com