ఈ సరికొత్త అర్జున రెడ్డి ఎవరో తెలుసా.?
- February 16, 2023
‘సిద్దార్ధ్ రాయ్’ అనే సినిమా పోస్టర్లు ఈ మధ్య సరికొత్తగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో హీరో, హీరోయిన్ గాఢమైన లిప్ లాక్‌తో యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. తాజాగా మరో పోస్టర్ ఈ సినిమా నుంచి రిలీజైంది.
ఈ పోస్టర్లో హీరో క్యారెక్టర్ నోట్లో రెండు సిగరెట్లు పెట్టుకుని పైకి చూస్తూ ఒళ్లంతా బ్లడ్తో నిండిన షర్టు ధరించి కనిపిస్తున్నాడు. గెడ్డం కింద ఓ రోజా పువ్వు కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సెన్సేషనల్ మూవీ ‘అర్జున రెడ్డి’ తలపుకు వస్తోంది.
దాంతో, ఎవరీ క్యారెక్టర్ అంటూ పోస్టర్ మీదున్న ఆర్టిస్టుని ఆరా తీయగా, ఆయన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలిసింది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించిన ఈ కుర్రోడు ‘లెజెండ్’ సినిమాలో బాలయ్య చిన్నప్పటి రోల్ పోషించి ప్రశంసలు దక్కించుకున్నాడు.
తాజాగా ‘సిద్దార్ధ రాయ్’ సినిమాతో హీరోగా రాబోతున్నాడు. పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏమో.! అర్జున రెడ్డి మాదిరి మనోడు కూడా సెన్సేషనల్ అయిపోతాడేమో చూడాలి మరి. అన్నట్లు మనోడి పేరు చెప్పలేదు కదా. దీపక్ సరోజ్.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







