తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి
- February 16, 2023
తెలంగాణ: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి రోజు పెను ప్రమాదాలు జరుగుతూ..మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రోడ్ అద్భుతంగా ఉండడం తో వాహనదారులు జెట్ స్పీడ్ గా వెళ్తున్నారు. ఇందులో కొంతమంది నిద్ర మబ్బులో , మరికొంత మంది తాగి డ్రైవ్ చేసి ప్రమాదాలు చేస్తున్నారు.
తాజాగా చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ ప్రైవేట్ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టడం తో నలుగురు మహిళలు మృతి చెందగా..12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ఉదయం రోజూవారిలాగానే 16 మంది మహిళలు ఆటోలో వెళ్తుండగా..మల్కాపురం గ్రామం వద్ద ప్రైవేట్ బస్సు స్పీడ్ గా వచ్చి ఆటో ను ఢీ కొట్టింది. దీంతో ఆటో లో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.తీవ్రంగా గాయపడ్డ నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అందించారు. కూలీలందరూ దేవాలమ్మ నాగారం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







