గూగుల్ ఉద్యోగులకు సుందర్ పిచాయ్ కీలక సూచనలు
- February 16, 2023
అమెరికా: అత్యంత అధునాతన కృత్రిమ మేధ ఆధారిత చాట్ బాట్ ను అభివృద్ధి చేసుకోవడంలో దిగ్గజ టెక్ కంపెనీలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నాయి. ప్రస్తుతం దీనిపైనే కంపెనీల మధ్య పోటీ నెలకొంది. ‘ఓపెన్ ఏఐ’ సంస్థ “చాట్ జీపీటీ” ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.
ఈ నేపథ్యంలోనే ఇతర కంపెనీలు “చాట్ జీపీటీ” తరహా చాట్ బాట్ లను ప్రవేశపెడుతున్నాయి. గూగుల్ ఇప్పటికే “బార్డ్”ను తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ ‘ఓపెన్ ఏఐ’ సంస్థతో కలిసి “చాట్ జీపీటీ”ని మరింత అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో పోటీలో ముందుండడానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక సూచనలు చేశారు.
తమ చాట్ బాట్ టెస్టింగ్ కోసం ప్రతిరోజు తమ ఉద్యోగులు 2-4 గంటలు సమయాన్ని వెచ్చించాలని చెప్పారు. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. “చాట్ జీపీటీ” కంటే మెరుగైన చాట్ బాట్ కోసం గూగుల్ తమ లాండా (లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్-LaMDA) సాయంతో బార్డ్ ప్రవేశపెట్టింది. అయితే, దాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. బార్డ్ సమర్థంగా పనిచేసేందుకు కొత్త పద్ధతులను గూగుల్ అమలు చేస్తోంది.
ప్రజలకు అందుబాటులోకి తెచ్చేముందు తమ ఉద్యోగులతో బార్డ్ ను టెస్ట్ చేయిస్తోంది గూగుల్. ఇటీవల చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ తమ చాట్ బాట్ “బార్డ్”ను ప్రవేశపెట్టిన రోజే ఓ ప్రశ్నకు “బార్డ్” తప్పుడు సమాచారం ఇవ్వడంతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ దాదాపు రూ.8 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో గూగుల్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా, కొన్ని రోజుల క్రితమే మైక్రోసాఫ్ట్ “చాట్ జీపీటీ” ఆధారిత కొత్త బింగ్ సెర్చ్, ఎడ్జ్ బ్రౌజర్ ను ప్రారంభించింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







