ప్రభుత్వ, ప్రైవేట్‌ లెక్చరర్లకు ఆన్‌లైన్‌ శిక్షణా తరగతులు: APNRTS

- February 16, 2023 , by Maagulf
ప్రభుత్వ, ప్రైవేట్‌ లెక్చరర్లకు ఆన్‌లైన్‌ శిక్షణా తరగతులు: APNRTS

విజయవాడ: విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించడం పై ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల లెక్చరర్లకు APNRTS,బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా NRI డాక్టర్లచే ఆన్ లైన్ తరగతుల నిర్వహణ-APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్దే ధ్యేయంగా ప్రవాసాంధ్రులకు వివిధ ఉచిత సేవలను అందిస్తుంది. అంతేకాకుండా వివిధ దేశాలలో స్థిరపడిన రాష్ట్రానికి చెందిన వారు తమ మాతృభూమికి సేవ చేయడానికి వారధిగా కూడా నిలుస్తోందని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు త్వరలో పబ్లిక్ పరీక్షలు (ఫైనల్స్) సమీపిస్తున్నసమయంలో విద్యార్థులు అధిక ఒత్తిడికి లోనవుతుంటారు.ఈ నేపథ్యంలో APNRTS, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా Life Skills - Stress Management పై శిక్షణను ప్రారంభించింది. ఇందులో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడం, టైమ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అలాగే మానసిక ఆరోగ్యం, జీవన నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం గురించి NRI డాక్టర్లచే జూనియర్ కళాశాలల లెక్చరర్లకు వర్చువల్ గా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ప్రతి జూనియర్ కళాశాల నుండి ఇద్దరు (02) లెక్చరర్లను ఎవరైతే ఇన్‌హౌస్ కౌన్సెలర్‌లుగా ఉంటారో వారికి ఒత్తిడిని ఎలా అధిగమించాలి అన్న విషయాలపై NRI డాక్టర్లచే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది. వీరు విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయడానికి అవలంభించవలసిన పద్ధతులు, ఇతర అవసరమైన మార్గాలపై శిక్షణ ఇవ్వబడుతుంది. ఆయా కళాశాలల లెక్చరర్లు ఈ విషయాలను, విద్యార్థులకు వివరిస్తున్నారని, ఇది జరగబోయే పరీక్షల ప్రేపరేషన్ కు విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు.

దీనికోసం రాష్ట్రంలోని దాదాపు 3,400 ప్రభుత్వ ,కార్పొరేట్ కళాశాలలోని 6,800 మంది లెక్చరర్లకు ఈ తరగతుల నిర్వహణ తలపెట్టడం జరిగింది.ఇప్పటి వరకు 50 శాతం కళాశాలల లెక్చరర్లకు ఈ శిక్షణావకాశం ఇవ్వడం జరిగింది.వచ్చే వారంలో మిగిలిన కళాశాలలోని లెక్చరర్లకు తరగతులు నిర్వహించడం జరుగుతుంది.ఆన్ లైన్ ద్వారా జరిగే ఈ కార్యక్రమం ఫిబ్రవరి 22వ తేదీ వరకు కొనసాగుతుంది. శిక్షణ పొందిన ఆయా కళాశాలల లెక్చరర్లు తమ విద్యార్థులకు ఒత్తిడిని అధిగమించడం, టైమ్ మేనేజ్ చేయడం గురించి వర్చువల్ శిక్షణలో వారు తెలుసుకున్న విషయ పరిజ్ఞానం మరియు మార్గాలను అర్థవంతంగా విద్యార్థులతో పంచుకుంటారు.

అమెరికాలోని అల్బామాకు చెందిన సర్టిఫైడ్ చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్. అపర్ణ వుప్ప, SPIF వ్యవస్థాపకుడు శ నెల్సన్ వినోద్ మోసెస్ (మెంటల్ హెల్త్ జర్నలిస్ట్ విభాగంలో అవార్డ్ గ్రహీత) వారి నిర్వహణలో కార్యక్రమం జరుగుతోంది.అలాగే ప్రముఖ యాంకర్, నటి, సామాజిక కార్యకర్త ఝాన్సీ మానసిక ఆరోగ్యం మరియు విద్యార్థులు పరీక్షల సమయంలో దీర్ఘకాలిక ఒత్తిడి ఎదుర్కొని, దానిని అధిగమించే మార్గాల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా జూనియర్ కళాశాలలలోని విద్యార్థినీ విద్యార్థులందరికి లబ్ది చేకూరుతుంది.

ఇప్పటికే APNRTS ప్రవాసాంధ్రులు వారి స్వగ్రామాలు, పట్టణాలలో పాఠశాలలు, కళాశాలలు లేదా ఆసుపత్రుల అభివృద్ధికి పలు సేవలు అందించడానికి APNRTS సహకారం అందిస్తోంది. అందులో భాగంగా, APNRTS ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు స్వచ్చందంగా ముందు కొస్తున్న NRI శిక్షకులతో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధి పై "ప్రశిక్షణ" పేరుతో శిక్షణలను నిర్వహిస్తోందని సీఈవో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com