దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ ప్రారంభం

- February 20, 2023 , by Maagulf
దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ ప్రారంభం

దోహా: 19వ దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో ఫిబ్రవరి 25 వరకు ఇది కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 500 పైగా ఆభరణాలు, వాచ్ బ్రాండ్‌లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని నిర్వాహకులు ప్రకటించారు. చారిత్రాత్మకంగా దేశంలోని అత్యంత గుర్తింపు పొందిన కొన్ని సమకాలీన ఆభరణాలు, వాచ్ బ్రాండ్‌లు తమ వ్యాపారాలను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. ఎగ్జిబిషన్‌కు 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. డమాస్ జ్యువెలరీ వారి అలీఫ్ సేకరణ, అసాధారణమైన హై-ఎండ్ డైమండ్స్, ప్రత్యేకమైన ఆభరణాల క్రియేషన్స్, లూయిస్ విట్టన్ వారి "ఫాంటసీ నెక్లెస్", 2.56 క్యారెట్ మోనోగ్రామ్ ఫ్లవర్ కట్ డైమండ్‌లు ఈసారి ప్రత్యేక ఆకర్షణలుగా నిలువనున్నాయి. ఈవెంట్‌లో మొదటిసారిగా టర్కిష్, భారతీయ పెవిలియన్లు ప్రత్యేక వారసత్వం, సంస్కృతిని తెలిపే డిజైన్లతో పాల్గొంటున్నాయి. కస్టమర్లు తమ ఆభరణాలను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ ద్వారా పరీక్షించి, సర్టిఫికేట్ పొందవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com