మజిద్‌ అల్‌ ఫత్తైమ్‌ పెట్టుబడులతో 42,000 ఉద్యోగాలు

- May 03, 2016 , by Maagulf
మజిద్‌ అల్‌ ఫత్తైమ్‌ పెట్టుబడులతో 42,000 ఉద్యోగాలు

ఒమన్‌లో మజిద్‌ అల్‌ ఫత్తైమ్‌ 15 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ పెట్టుబడితో 2020 నాటికి 42000 ఉద్యోగాలు రానున్నాయి. మజిద్‌ అల్‌ పత్తైమ్‌ - హోల్డింగ్‌ సీఈఓ అలైన్‌ బెజ్జాని మాట్లాడుతూ, రానున్న ఐదేళ్ళలో కంపెనీ పెట్టుబడుల ద్వారా 16,973 ప్రత్యక్ష ఉద్యోగాలు, 25,459 పరోక్ష ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. మాల్‌ ఆఫ్‌ ఒమన్‌ అభివృద్ధితో 29,000 డైరెక్ట్‌ జాబ్స్‌ వస్తాయని అంచనా వేస్తున్నారు. మజిద్‌ అల్‌ ఫత్తైమ్‌కి చెందిన సిటీ సెంటర్‌ సోహార్‌ ప్రాజెక్ట్‌ నార్త్‌ బతినాలో అతి పెద్ద షాపింగ్‌ మరియు లైఫ్‌ స్టైల్‌ డెస్టినేషన్‌ కాబోతోంది. దీని ద్వారా 8,000 ఉద్యోగాలు వస్తాయి. మై సిటీ సెంటర్‌ సుర్‌, 3,500 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించనుంది. కన్‌స్ట్రక్షన్‌ మరియు ఆపరేషన్‌ రంగంలో 190 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ పెట్టుబడులతో 23,000 ఉద్యోగాల్ని జనరేట్‌ చేయనుంది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 65,579కి చేరబోతుందని బెజ్జాని అభిప్రాయపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com