అబుధాబిలో ప్రారంభమైన డిఫెన్స్ ఫెయిర్ ‘ఐడెక్స్’

- February 20, 2023 , by Maagulf
అబుధాబిలో ప్రారంభమైన డిఫెన్స్ ఫెయిర్ ‘ఐడెక్స్’

యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద డిఫెన్స్ ఫెయిర్‌లలో ఒకటైన ‘ఐడెక్స్’ అబుధాబిలో ప్రారంభమైంది. 65 దేశాల నుండి సుమారు 130,000 మంది సందర్శకులు ఐదు రోజుల అంతర్జాతీయ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (ఐడెక్స్)కు హాజరవుతారని అంచనా.  30వ సంవత్సరం జరుగుతున్న డిఫెన్స్ ఫెయిర్‌లో దాదాపు 1,350 కంపెనీలు, 350 ప్రతినిధి బృందాలు , అనేక మంది సైనిక సిబ్బంది, అధికారులు,  నిర్ణయాధికారులు హాజరవుతారని భావిస్తున్నారు.  డిఫెన్స్ ఫెయిర్ లో మొదటి రోజు ( సోమవారం) సాయుధ వాహనాలు, డ్రోన్లు, గైడెడ్ క్షిపణులు, తాజా రక్షణ సాంకేతికత, వ్యవస్థలు ఆకట్టుకున్నాయి. యూఏఈ ఈ సంవత్సరం అతిపెద్ద పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రదర్శనకు పెట్టిన మానవరహిత వైమానిక పోరాట వాహనాలు, లాజిస్టిక్ సపోర్ట్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు ఉన్నాయి. 2021లో Dh133 బిలియన్ల నుండి 2031 నాటికి దేశ స్థూల దేశీయోత్పత్తికి స్థానిక పారిశ్రామిక రంగం సహకారాన్ని Dh300 బిలియన్లకు ($81.68 బిలియన్లు) పెంచాలని కోరుతూ యూఏఈ తన “ఆపరేషన్ 300 బిలియన్ల వ్యూహాన్ని” వేగవంతం చేస్తున్నట్ల ప్రకటించిన విషయం తెలిసిందే.  ఐడెక్స్ తోపాటు నావల్ డిఫెన్స్ & మారిటైమ్ సెక్యూరిటీ కూడా ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తుంది. ఇందులో ఎనిమిది దేశాలకు చెందిన నౌకాదళ నౌకలు పాల్గొంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com