పెన్షన్లు బంద్‌: చక్కర్లు కొడ్తున్న రూమర్లు

- May 03, 2016 , by Maagulf
పెన్షన్లు బంద్‌: చక్కర్లు కొడ్తున్న రూమర్లు

బహ్రెయిన్‌లో పెన్షన్లను ఎత్తివేస్తారంటూ సోషల్‌ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. రిటైర్‌మెంట్‌ సిస్టమ్‌ - పెన్షన్ల విధానంపై సమీక్ష అవసరం అని పేర్కొంటూ ఫైనాన్స్‌ మినిస్టర్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ ఖలీఫా, పార్లమెంట్‌ సెషన్‌లో పేర్కొనడంతో ఈ రూమర్స్‌ పాపులర్‌ అయ్యాయి. అయితే దీనిపై అధికారిక వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులతో సబ్సిడీలు, పెన్షన్లపై సమీక్ష తప్పనిసరి అన్న చర్చ 2012 నుంచీ జరుగుతోంది. అయినప్పటికీ దీనిపై నిర్ణయం ఇంకా తీసుకోవలసి ఉంది. విస్తృతంగా చర్చ జరిగే నిర్ణయం ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతుండగా, సబ్సిడీలతోపాటు పెన్షన్లను ఎత్తివేస్తారేమోనన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతుంది. మే 10న జరిగే సెషన్‌లో విస్తృత చర్చ జరిపేందుకు ఎంపీలు నోటీస్‌ ఇవ్వడం జరిగిందని ఎంపీ బుయాలి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com