5G నెట్వర్క్కి 80 వేల మంది అప్‌గ్రేడ్
- February 21, 2023
మస్కట్: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) సంబంధిత కంపెనీల సహకారంతో 2022 చివరి నాటికి ఒమన్ సుల్తానేట్‌లో 80,000 కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను 5G నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. ఈ మేరకు TRA సర్వీస్ క్వాలిటీ అండ్ కాంప్రహెన్సివ్ సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇంజనీర్ నాసర్ బిన్ మొహమ్మద్ అల్ జబ్రీ వెల్లడించారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పరిధిలో సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ఇంటర్నెట్ వేగం, డౌన్లోడ్ వేగం, వీడియో నాణ్యత, సౌండ్ క్వాలిటీని కొలవడానికి, 11 విలాయాట్లలో వేగాన్ని కొలవడానికి ముందుగా సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం ఏటా ప్రకటించబడే ఫీల్డ్ సర్వేలు చేపట్టామని, ఇది పూర్తయిన తర్వాత వాటి వివరాలను సోషల్ నెట్‌వర్క్‌లలోని దాని అధికారిక ఖాతాలలో వెల్లడిస్తుందని తెలిపారు. నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పెంచడానికి, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని మెరుగుపరచడానికి అథారిటీ ప్రస్తుతం పని చేస్తోందని అల్ జబ్రీ పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో అథారిటీ మిషన్లలో ఐదవ తరం నెట్‌వర్క్‌లకు అలాగే ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి కాపర్ కేబుల్స్ ద్వారా పనిచేసే హోమ్ ఇంటర్నెట్ శ్రేణి నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లను నాల్గవ తరం నెట్‌వర్క్‌ల నుండి ఐదవ తరం నెట్‌వర్క్‌లు, ఫైబర్ ఆప్టిక్స్కు అప్‌గ్రేడ్ చేయడంలో అథారిటీ పని చేసిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు