పాలతో కలిపి ఈ పదార్ధాలు తీసుకుంటున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!

- February 21, 2023 , by Maagulf
పాలతో కలిపి ఈ పదార్ధాలు తీసుకుంటున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!

కొన్ని రకాల ఆహార పదార్ధాలను కలిపి తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. కూరగాయలను మిక్సింగ్ చేసి వండడం సర్వసాధారణం. అయితే, కూరగాయలతో ఒక్కోసారి పాలను మిక్స్ చేస్తూ చేసే వంటకాలుంటాయ్. వాటితోనే నష్టం అంటున్నారు.
పాలలో చక్కెర తప్ప ఇంకేదీ మిక్స్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్స్ కూడా తీసుకోకూడదని అంటున్నారు. అలాగే పండ్లను తిన్న తర్వాత వెంటనే పాలు తాగరాదట. వేడి వేడి పాలలో తేనెను మిక్స్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. 
ఉడికించిన గుడ్డుతో పాలను తీసుకోవడం సర్వసాధారణం. ఈ కాంబినేషన్ కూడా సరైనది కాదని అంటున్నారు. ఈ రెండింట్లోనూ ప్రొటీన్లు అధికంగా వుంటాయ్. డబుల్ డోస్‌లో శరీరానికి ప్రోటీన్లు ఒకేసారి అందించడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశాలున్నాయట. 
ముల్లంగితోనూ పాలను మిక్స్ చేయరాదట. మినపప్పుతో చేసిన ఆహారం తీసుకున్న వెంటనే కూడా పాలను తీసుకోరాదట. కూరగాయలతో కలిపి చేసిన కిచిడీని పాలతో మిక్స్ చేసి తినడం కొందరికి అలవాటు. కానీ, ఆ అలవాటు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com