మెగాస్టార్.. పవర్ స్టార్‌కి ఫ్యాన్ అయితే తప్పేంటంటా.!
- February 21, 2023
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. సమ్మర్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర గురించి ఓ ఇంట్రెస్ట్ అప్‌డేట్ ప్రచారంలో వుంది. ఈ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిగా కనిపిస్తారనేది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, ఈ ప్రచారం పట్ల సోషల్ మీడియాలో కొంత దుష్ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ఏంటీ.? పవన్ ఫ్యాన్‌గా కనిపించడమేంటీ.? అంటూ మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానుల మధ్య చిచ్చు రేగిందంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
తూచ్.! అదంతా వుత్తదే. అయినా చిరంజీవికి, పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టం. తమ్ముడికి అభిమాని పాత్రలో కనిపించడాన్ని తానేమాత్రం చిన్నతనంగా ఫీలవ్వరు.. ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారమే అంటున్నారు మెగా అభిమానులు.
ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!