మెగాస్టార్.. పవర్ స్టార్‌కి ఫ్యాన్ అయితే తప్పేంటంటా.!
- February 21, 2023మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. సమ్మర్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర గురించి ఓ ఇంట్రెస్ట్ అప్డేట్ ప్రచారంలో వుంది. ఈ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిగా కనిపిస్తారనేది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, ఈ ప్రచారం పట్ల సోషల్ మీడియాలో కొంత దుష్ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ఏంటీ.? పవన్ ఫ్యాన్‌గా కనిపించడమేంటీ.? అంటూ మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానుల మధ్య చిచ్చు రేగిందంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
తూచ్.! అదంతా వుత్తదే. అయినా చిరంజీవికి, పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టం. తమ్ముడికి అభిమాని పాత్రలో కనిపించడాన్ని తానేమాత్రం చిన్నతనంగా ఫీలవ్వరు.. ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారమే అంటున్నారు మెగా అభిమానులు.
ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ