భారతీయ కార్మికులకు డిమాండ్.. 3.5 మిలియన్లతో టాప్
- February 22, 2023
యూఏఈ: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్యోగులను నియమించుకోవడంలో ఫిలిప్పీన్స్, ఇండియా, పాకిస్థాన్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తాజా నివేదిక తెలిపింది. మంగళవారం విడుదల చేసిన డీల్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ హైరింగ్ రిపోర్ట్ ప్రకారం.. ఆస్ట్రేలియా, సింగపూర్, భారతదేశం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో గత ఏడాది సంస్థలు నియమించుకున్న ఉద్యోగుల్లో అత్యధికశాతం ఈ మూడు దేశాలకు చెందినవారే ఉన్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా, హాంకాంగ్, భారతదేశం కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా నివేదిక తెలిపింది.
యూఏఈలో అన్ని ప్రవాస కమ్యూనిటీలలో అత్యధిక సంఖ్యలో భారతీయులు, పాకిస్తానీ పౌరులు ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో సుమారు 3.5 మిలియన్ల భారతీయ పౌరులు, 1.7 మిలియన్ల పాకిస్తానీలు, 650,000 మంది ఫిలిప్పినోలు పనిచేస్తున్నారు. ఆసియా-పసిఫిక్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సేల్స్ అండ్ ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాలని డీల్ అధ్యయనం వెల్లడించింది. వేతనాల పరంగా తైవాన్, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా అన్ని ఉద్యోగాలలో అత్యధిక సగటు జీతం లాభాలను అందించాయని తెలిపింది.
డీల్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ హైరింగ్ రిపోర్ట్ డేటా 260,000 కంటే ఎక్కువ కాంట్రాక్టులు, 160 కంటే ఎక్కువ దేశాలలో 15,000-ప్లస్ కస్టమర్లు, అలాగే మైక్రోవర్స్తో సహా థర్డ్-పార్టీ సోర్స్‌ల నుండి 500,000 డేటా పాయింట్లపై ఆధారపడి నివేదికను తయారు చేసింది. నివేదికలోని అన్ని దేశాలు, రాష్ట్రాలు, నగరాలు డిసెంబర్ 2022 నాటికి ఫైల్లో కనీసం 50 వర్కర్ కాంట్రాక్ట్‌లను కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నియామకాలు ఏడాది పొడవునా కొనసాగగా.. మొత్తం ఒప్పందాలలో 89 శాతం రిమోట్ పాత్రలకు సంబంధించినవి ఉన్నాయి. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ కోసం డీల్ ల్యాబ్ చైర్మన్ ప్రొఫెసర్ శామ్యూల్ దహన్ మాట్లాడుతూ.. ఫిలిప్పీన్స్, ఇండియా, బ్రెజిల్‌లలో కంటెంట్ సృష్టి, కార్యకలాపాలు, సగటు ప్రారంభ వేతనాలు ఎక్కువగా పెరిగాయని చెప్పారు. అకౌంటెంట్లు, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్లు, కన్సల్టెంట్లు, డిజైనర్లు మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పాత్రల కోసం ప్రపంచవ్యాప్తంగా కొత్త కార్మికులకు సగటు వేతనాలు తగ్గాయని తెలిపారు. క్రిప్టోకరెన్సీలలో అస్థిరత కారణంగా కార్మికులు, క్రిప్టోకరెన్సీలలో చెల్లింపులను స్వీకరించడంలో కొంత ఆసక్తి చూపడం లేదని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!