సౌదీ వ్యవస్థాపక దినోత్సవం.. మూడు శతాబ్దాలుగా అన్ని రంగాల్లో పురోగతి

- February 22, 2023 , by Maagulf
సౌదీ వ్యవస్థాపక దినోత్సవం..  మూడు శతాబ్దాలుగా అన్ని రంగాల్లో పురోగతి

రియాద్: మూడు శతాబ్దాలుగా సుస్థిరత, న్యాయం, ఐక్యతను సాధించిన సౌదీ అరేబియా.. అన్ని రంగాలలో పురోగతి సాధిస్తుందని, సౌదీ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కోసం అడుగులు వేస్తుందని రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అన్నారు. వ్యవస్థాపక దినోత్సవం (ఫిబ్రవరి 22న)సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం ఇర్కా ప్యాలెస్‌లో తన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కింగ్ సల్మాన్ పేర్కొన్నారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2023లో రాజ్యం భాగస్వామ్యాన్ని కూడా కేబినెట్ చర్చించింది. చర్చలు, శాంతియుత పరిష్కారాలకు సౌదీ మద్దతు కొనసాగుతుందన్నారు. ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి అవకాశాలను అందిస్తుందని కేబినెట్ పేర్కొంది.  

యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ వెస్ట్రన్ ఆసియా (ESCWA) జారీ చేసిన ప్రభుత్వ ఎలక్ట్రానిక్, మొబైల్ సేవల మెచ్యూరిటీ ఇండెక్స్‌లో కింగ్‌డమ్ మొదటి ర్యాంక్‌ పొందడంపై కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అండ్ డెవలప్‌మెంట్ అఫైర్స్, కౌన్సిల్ ఆఫ్ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్, క్యాబినెట్ జనరల్ కమిటీ, కేబినెట్ బ్యూరో ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఇటీవల సాధించిన విజయాలను సమీక్షించారు. వ్యవసాయం, చేపల పెంపకం, ఆక్వాకల్చర్ రంగాలలో సాంకేతిక సహకారం కోసం సౌదీ ప్రభుత్వం, దక్షిణాఫ్రికా ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందంతో పాటు ఇటీవల సౌదీ అరేబియా ప్రభుత్వం చేసుకున్న పలు ఒప్పందాలకు, చట్ట సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com