పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా షురూ చేసేశాడుగా.!

- February 22, 2023 , by Maagulf
పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా షురూ చేసేశాడుగా.!

పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో తమిళ రీమేక్ ‘వినోదయసిత్తం’ ఒకటి. ఒరిజినల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన సముద్రఖని ఈ సినిమాని తెలుగులోనూ డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్‌డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు పవన్ అభిమానులు.

సైలెంట్‌గా ఈ సినిమాని స్టార్ట్ చేసేశాడు పవన్ కళ్యాణ్. తాజాగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలెట్టేశారు. కేవలం 20 రోజులు మాత్రమే ఈ సినిమాకి పవన్ డేట్స్ కేటాయించారు. ఈ సినిమా కోసం పవన్‌తో చేయాల్సిన షాట్స్ అన్నీ ఇన్‌డోర్‌లోనే కానిచ్చేయనున్నారట. 

ఆల్రెడీ అందుకోసం సెట్స్ కూడా సిద్ధం చేసేశారట. ఈ సినిమా కథ అంతా లీడ్ రోల్ అయిన సాయి ధరమ్ తేజ్ చుట్టూ తిరగనుంది. పవన్ దేవుడి పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా ఈ సినిమా పూర్తి చేసి పక్కన పెట్టేయనున్నాడు పవన్. పవర్ స్టారా.? మజాకానా.? ఇదిగో అదిగో అన్నది కాస్తా.. సింపుల్‌గా స్టార్ట్ చేసి చూపించేశాడంతే.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com