పవర్ స్టార్ కిరణ్ అబ్బవరం.! ఏందప్పా సిద్దప్పా ఈ కొత్త కిక్కు.!
- February 22, 2023
అదేంటీ.! పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ కదా.. కిరణ్ అబ్బవరం ఎక్కడ నుంచి వచ్చాడు.? ఎప్పుడు పవర్ స్టార్ అయిపోయాడు.? అనుకుంటున్నారా.? అయితే మీకు అసలు విషయం అర్జంటుగా తెలియాల్సిందేనండోయ్.
సాప్ట్‌వేర్ ఇంజనీర్ అయిన మన సారు.. సినిమాపై పిచ్చి ప్రేమతో, వేల జీతం వచ్చే ఆ వుద్యోగాన్ని త్యాగం చేసేసి హీరో అయిపోయాడు. అయిపోయాడా.? వరుసగా సినిమాలు కూడా చేసేస్తున్నాడు. పెద్ద పెద్ద బ్యానర్లని సైతం ఎంగేజ్ చేసేస్తున్నాడు.
అంతా బాగానే వుంది. అంత మాత్రాన పవర్ స్టార్ అయిపోతాడా.? రీసెంట్‌గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సపోజ్.. ఫర్ సపోజ్ ఈ సినిమా సూపర్ హిట్టులాంటిదేదో అయిపోయిందనుకోండి. అంత మాత్రానికే పవర్ స్టార్ అయిపోతాడా.? అయిపోయాడు మరి. పవర్ స్టార్ కిరణ్ అబ్బవరం అంటూ డిజైన్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి బయటికొచ్చింది.
ఆ పోస్టర్‌పై మనోడు గుస్సా అవుతున్నాడు. ఎన్నో సినిమాలు చేసి, ఎంతో క్రేజ్, స్టార్‌డమ్ వున్న పవర్ స్టార్ ఎక్కడా.? నేనెక్కడా.? కొంచెమైనా బుద్దుండాలిగా ఈ పోస్టర్ తయారుచేసినోళ్లకి.. అంటూ సదరు పోస్టర్ మేకర్లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. అసలు సంగతి ఇప్పుడు బోధపడాలె. అద్గదీ సంగతి.!
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?