సౌదీ అరేబియా ఫౌండింగ్ డే: అంబరాన్నంటిన సంబరాలు

- February 23, 2023 , by Maagulf
సౌదీ అరేబియా ఫౌండింగ్ డే: అంబరాన్నంటిన సంబరాలు

 

జెడ్డా: సౌదీ అరేబియా వ్యవస్థాపక దినోత్సవం(ఫిబ్రవరి 22) సందర్భంగా సంబరాలు అంబరాన్నంటాయి. సౌదీ చరిత్రను తెలియజేసేలా వేడుకలను నిర్వహించారు. దాదాపు 600 సంవత్సరాల కిందట దిరియా నగరాన్ని రెండు పవిత్ర మస్జీదులు కింగ్ సల్మాన్ 13వ తాత అయిన మానీ అల్-మురైది స్థాపించారు. 1139 AH / 1727 ADలో అధికారాన్ని స్వీకరించిన ఇమామ్ ముహమ్మద్ బిన్ సౌద్ పాలనలో నగర-రాష్ట్రం నుండి విశాలమైన రాష్ట్రంగా అవతరించింది. ఇలాంటి చారిత్రక సంఘటనలను ఈ తరానికి గుర్తు చేసేలా వేడుకలను నిర్వహించారు. సౌదీ రాజ్య స్థాపన తర్వాత కొద్ది కాలంలోనే సంస్కరణలకు సౌదీ మద్దతుగా నిలిచింది. విద్య, ఆర్థికం, భద్రత, ఐక్యత,  సైన్స్‌ రంగాలలో సౌదీ అరేబియా విశేష కృషి చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com