టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
- February 23, 2023
టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
విజయవాడ: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కన్నాకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. టీడీపీ కార్యాలయ పరిసరాలు ఆ పార్టీ కార్యకర్తలలో నిండిపోయాయి. స్టేజీపై తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ మంగళగిరి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆయనతో వేలాది మంది అభిమానులు వచ్చారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద కూడా టీడీపీ ఫ్లెక్సీలు భారీగా కనపడ్డాయి. మాజీ సీఎంలు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేత లోకేశ్ ఫ్లెక్సీలను కార్యకర్తలు ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణకు కాపు సామాజిక వర్గంలో పట్టు ఉంది.నిన్న పలువురు టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.ఏపీ బీజేపీ నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025