గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా.?

- February 23, 2023 , by Maagulf
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా.?

మనిషి ఆరోగ్యంగా వుండడం అంటే, శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా పని చేయడమే. పైకి ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి అయినా సరే, కొన్ని సార్లు హార్ట్ ఎటాక్‌కి గురవుతుంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకు కారణాలేంటీ.? ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే ఏం చేయాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? మొలకెత్తిన గింజలు, మాంసం, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటూ, పండ్లను సరైన మోతాదులో తీసుకోవాలి.

దీంతో పాటూ కంటికి సరిపడా నిద్ర, గుండె ఆరోగ్యంలో కీలకమైన అంశం. బిజీ బిజీ జీవన శైలిలో నిద్రను చాలా అశ్రద్ధ చేస్తున్నారు. మొబైల్ వాడకం కూడా నిద్రాభంగకారిలో కీలక పాత్ర పోషిస్తోంది. 

గుండెను ఆరోగ్యంగా వుంచాలంటే, ఖచ్చితంగా సుఖమైన నిద్ర వుండాలని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 8 గంటల పాటూ మంచి నిద్ర వుండాలని సూచిస్తున్నారు. నిద్రలోనే గుండెకు కాస్త విశ్రాంతి దొరుకుతుందని సర్వేలో తేలింది. సో, నిద్ర మాత్రమే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పెరిచే ప్రక్రియ. ఆ నిద్రను అస్సలు అశ్రద్ధ చేయరాదు. ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే, తగినంత నిద్ర వుంటేనే అసలు సిసలు ఆరోగ్యం సొంతమయ్యేది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com