రేపటి నుంచి హైదరాబాద్‌లో 20వ బయోఆసియా సదస్సు..

- February 23, 2023 , by Maagulf
రేపటి నుంచి హైదరాబాద్‌లో 20వ బయోఆసియా సదస్సు..

హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక 20వ అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు శుక్రవారం ప్రారంభమవనుంది. నేటి నుంచి 26వ తేదీ వరకు హెచ్‌ఐసీసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో పరిశ్రమ, విద్యాసంస్థలను(అకాడమీ)ని అనుసంధానించడమే లక్ష్యంగా బయో ఆసియా ఫోరం పనిచేస్తోంది. ఇందులో భాగంగా బయోఆసియా సదస్సులను ఈ ఫోరం నిర్వహిస్తోంది. ప్రభుత్వం, నియంత్రణ అథారిటీలు, స్టేక్‌ హోల్డర్లు మధ్య సమన్వయం సాధించి హెల్త్‌కేర్‌ రంగ వృద్ధికి బయో ఆసియా ఫోరం దోహదపడుతోంది. ఈసారి సదస్సు అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌ : షేపింగ్‌ నెక్స్ట్‌ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌ అనే థీమ్‌తో సదస్సు జరగనుంది. భారతదేశ లైఫ్‌సైన్సెస్‌ రంగంలో బయోఆసియా సదస్సుది కీలక పాత్ర వహించనుంది. ఈ సదస్సులో 100కుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నోబెల్‌ అవార్డు గ్రహీతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com