రష్యా బ్యాంక్ బ్రాంచీ ఏర్పాటు.. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన

- February 25, 2023 , by Maagulf
రష్యా బ్యాంక్ బ్రాంచీ ఏర్పాటు.. యూఏఈ  సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన

యూఏఈ: ఎంటీఎస్(MTS0 బ్యాంక్‌పై విధించిన ఆంక్షలతో సహా రష్యన్ ఫెడరేషన్‌పై కొత్త ఆంక్షల ప్యాకేజీకి సంబంధించి యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) సమీక్షించింది. విదేశీ బ్యాంకుల లైసెన్సింగ్ బ్రాంచ్‌లకు బ్యాంక్ ప్రమాణాలను పూర్తి చేసిన తర్వాత ఆమోదించబడిన లైసెన్సింగ్ విధానాల ప్రకారమే  అబుధాబిలో శాఖను తెరవడానికి MTS బ్యాంక్‌కి లైసెన్స్ మంజూరు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షణలో రష్యన్ కమ్యూనిటీకి రెండు దేశాల మధ్య చట్టబద్ధమైన వాణిజ్యానికి మద్దతు ఇవ్వడానికి బ్యాంక్ దోహదపడిందన్నారు. యూఏఈలో కార్యకలాపాలు నిర్వహించేందుకు లైసెన్స్ పొందిన బ్యాంకుల అవసరాలకు అనుగుణంగా బ్యాంక్ తన కార్యకలాపాలను ప్రారంభించే ముందు, సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్ AML/CFT విధానాలను సమీక్షించడంతోపాటు వాటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లను పరీక్షించినట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com