కేంద్ర సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి
- February 25, 2023
పశ్చిమబెంగాల్: పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం గమన్హారం.. ఈ సంఘటనతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపైకి కర్రలు పట్టుకుని బీజేపీ కార్యకర్తలు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర్తలు.. రాళ్లదాడి చేశారు.
కారు అద్దాలు పగులగొట్టి.. మంత్రికి నల్లజెండాలతో నిరసన తెలిపారు. పోలీసులు తృణమూల్ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేసినా.. వారు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఇక ఈ దాడి పై నిళిత్ ప్రమాణిక్ మండిపడ్డారు. ఓ కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ లో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో అర్థం అవుతుందన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. హింసకు పాల్పడిన వారికి రక్షణ కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..